భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాకినాడ జిల్లా కత్తిపూడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో భవానీ భక్తులు మృతిచెందడంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన భక్తుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు.





