కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కూటమి ప్రభుత్వం ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కిందని నెల్లూరులో మాజీ మంత్రి కాకాని విమర్శించారు. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకుంటున్నారని.. వెళ్లాలని చూస్తే పోలీసులు తమకు నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో జరిగిన హింసపై అధికారులు ఎన్నికల సంఘానికి రిపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ అభ్యర్థులను స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వకపోతే రేపు జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.





