రాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ హుకుంపేట నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఏఎస్పీ పటేల్ పరిశీలించారు. జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని.. మంచి ముహూర్తం నేపథ్యంలో ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. నామినేషన్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్, 100 మీటర్ల నిబంధన అమల్లో ఉందని.. ర్యాలీలకు అనుమతి లేదన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.





