విశాఖలో పోటీ నుంచి తప్పుకున్న వైసీపీ అభ్యర్థి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖ 14వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి రెడ్డి జీవన్ కిరణ్మయి పోటీ నుంచి తప్పుకుని నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, తనపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నందున రక్షణ కల్పించాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బెదిరింపులకు గురిచేసి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేశారని వైసీపీ ఆరోపించింది. కాగా అభ్యర్థి స్వచ్ఛందంగానే తప్పుకున్నట్లు వాంగ్మూలం ఇచ్చారని, సోషల్ మీడియా ప్రచారాలు నమ్మొద్దని ఆరిలోవ పోలీసులు ప్రకటించారు.





