నేడు వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గూండా లక్ష్మీదేవి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
టీడీపీ సీనియర్ నేత, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గూండా లక్ష్మీదేవి ఇవాళ వైసీపీలో చేరనున్నారు. 40 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న ఆమె.. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే టీడీపీలో వరుసగా జరుగుతున్న అవమానాలతో పార్టీని వీడుతున్నట్లు నిన్న ప్రకటించారు. ఇవాళ జగన్ సమక్షంలో లక్ష్మీదేవితో పాటు శ్రీకాకుళంకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరనున్నారు.





