కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేని స్థితికి చేరిందని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, కూటమి నేతలు వక్రభాష్యం చెప్తున్నారని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీస్తున్నారని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నామినేషన్లకు అడ్డంకులు సృష్టించవద్దని, ఎస్ఈసీ స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.





