మంత్రాలయంలో 144 సెక్షన్ మధ్య నామినేషన్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇవాళ వైసీపీ, టీడీపీ తరపున ఇరు పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీంతో అడిషనల్ ఎస్పీ, ఎమ్మిగనూరు డీఎస్పీ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో మాధవరం, నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీడీపీకి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైసీపీకి నామినేషన్లు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.





