పుంగనూరు ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో టెన్షన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లతో రెండో రోజూ టెన్షన్ వాతావరణం నెలకొంది. సదుంలో టీడీపీ నేత పవన్ కుమార్ రెడ్డిపై దాడి, ఆయన కారు దహనం ఘటనల్లో వైసీపీ కార్యకర్తలపై మూడు కేసులు నమోదయ్యాయి. పుంగనూరు నామినేషన్ సెంటర్ వద్ద రాళ్లు, కర్రలు, గాజు సీసాలతో దాడి చేసిన 173 మంది వైసీపీ సానుభూతిపరులపై టీడీపీ కార్యకర్త శివ ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు. రొంపిచర్ల, పులిచెర్ల మండలాల్లో చెదురుమదురు ఘటనలు జరగ్గా.. సోమల మండలంలో తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.





