తునిలో దాడిశెట్టి రాజా హౌస్ అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాకినాడ జిల్లా తునిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న తొండంగి ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య ఘర్షణలు జరగ్గా.. రాజా అక్కడ నాలుగు గంటల పాటు బైఠాయించారు. ఇవాళ మరోసారి తొండంగిలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. దీంతో ఆయన తొండంగి వెళ్లకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.





