నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి హౌస్ అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి నామినేషన్లలో పాల్గొనడానికి కాకాణి సిద్ధమయ్యారు. అయితే ఆయన నామినేషన్లలో పాల్గొనడానికి వీలులేదని పోలీసులు నోటీసు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఇంటి వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.





