రోడ్డు ప్రమాద బాధితులకు హోంమంత్రి అనిత సాయం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖలో హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆరిలోవ హెల్త్ సిటీ బీఆర్‌టీఎస్ రోడ్డులో స్కూటీని బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ రోడ్డు ప్రమాదాన్ని గమనించిన హోంమంత్రి అనిత తక్షణ సాయం అందించి.. గాయపడ్డ విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను, ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.





