నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ కసరత్తు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణలో నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై సీఎం, పీసీసీ కసరత్తు ముమ్మరం చేశారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యమిస్తూ.. పార్టీ కోసం పనిచేసిన నేతలకు పదవులు కేటాయించడంపై దృష్టి పెట్టారు. గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపైనా సమాలోచనలు జరుగుతుండగా.. ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయి సమన్వయంపై కాంగ్రెస్ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది.





