మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అనంతపురం జిల్లా తిమ్మంపల్లిలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తెల్లవారుజామునే హౌస్ అరెస్ట్ చేశారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరులో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దగ్గరుండి నామినేషన్లు వేయించేందుకు స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్లిన ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యల్లనూరు నామినేషన్ కేంద్రం వద్ద రౌడీయిజం చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని వదిలేసి తనను గృహ నిర్బంధం చేయడం ఏంటని మండిపడ్డారు.





