కత్తిపూడి రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతిచెందడం అత్యంత బాధాకరమని, వారి మృతి తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి.. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.





