విశాఖ రౌడీషీటర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖలో రౌడీషీటర్ గొల్ల మండల రాజు హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. చుక్క రవిశంకర్ అనే రౌడీషీటర్ సహా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ దుర్గ, అప్పలరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.





