విజయవాడలో యువకుడిని కొట్టి చంపిన నిందితులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడ పటమట డొంకరోడ్డులో వాటర్ బాటిల్ దొంగతనానికి యత్నించాడని ఓ యువకుడిని కొట్టి చంపారు. ఈనెల 18న మద్యం మత్తులో పాన్ షాపు ఫ్రిడ్జ్ నుంచి బాటిల్ తీసేందుకు ప్రయత్నించిన నల్గొండకు చెందిన మాస సాయి కుమార్ను.. కరెంట్ స్తంభానికి కట్టేసి నాలుగు గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. దెబ్బలు తాళలేక అతడు చనిపోయాడని తెలిసి నలుగురు నిందితులు పరారవగా.. పోస్ట్మార్టంలో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో నిందితులు అయ్యప్పశంకర్ సాయికుమార్, పోతంశెట్టి నవీన్, సాయిప్రణీత్లను పటమట పోలీసులు అరెస్టు చేశారు.





