దసరా జంబూసవారిలో కలకలం.. 650 కిలోల అంబారితో అదుపుతప్పిన ఏనుగు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కర్ణాటకలోని శివమొగ్గ దసరా ఊరేగింపులో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. సుమారు 650 కిలోల వెండి అంబారిని మోస్తున్న ‘సోమన్న’ ఏనుగు ఒక్కసారిగా అదుపుతప్పి వీధుల్లో పరుగులు తీసింది.
ఏనుగు దూసుకెళ్లడంతో పలు వాహనాలు, నిర్మాణాలు దెబ్బతిన్నాయి. పరుగులో అంబారి కూడా కిందపడగా, మావటికి గాయాలైనట్లు సమాచారం.
అటవీ శాఖ సిబ్బంది, మావటీలు రంగంలోకి దిగి చివరకు ఏనుగును అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనతో దసరా వేడుకలకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.





