ఢిల్లీలో గాలి మళ్లీ విషమం.. ఒక్కరోజులో AQI 179 నుంచి 244కు జంప్!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఢిల్లీలో వాయుకాలుష్యం ఒక్కరోజులోనే గణనీయంగా పెరిగింది. అక్టోబర్ 20న 179గా ఉన్న AQI, అక్టోబర్ 21న 244కు చేరడంతో ‘Poor’ కేటగిరీలోకి వెళ్లింది.
దీంతో GRAP Stage-1 అమల్లోకి వచ్చింది. రోడ్లపై ధూళి నియంత్రణ, మెకానికల్ స్వీపింగ్, నీటి పిచికారీ, బహిరంగ చెత్త దహనంపై కట్టడి, డీజిల్ జనరేటర్ల వినియోగంపై పరిమితులు అమలు చేయనున్నారు.
ఇక నవంబర్ 1 నుంచి ఢిల్లీలో ‘No PUC – No Fuel’ నిబంధన అమలులోకి రానుంది. అలాగే ఢిల్లీకి వెలుపల రిజిస్టర్ అయిన BS-VI కంటే తక్కువ ప్రమాణాల వాహనాల ప్రవేశంపై ఆంక్షలు, పార్కింగ్ ఛార్జీల పెంపు వంటి చర్యలు కూడా అమల్లోకి రానున్నాయి.





