ఒమన్ తీరంలో అరుదైన గులాబీ డాల్ఫిన్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఒమన్ తీరంలో అరుదైన గులాబీ రంగు డాల్ఫిన్ కనిపించింది. మస్కట్ సమీపంలోని ఖంతబ్ బీచ్ వద్ద ఈ డాల్ఫిన్ ప్రత్యక్షమైంది.
సముద్రపు నీటిలో మరో బూడిద రంగు డాల్ఫిన్‌తో కలిసి ఈ డాల్ఫిన్ ఈదుతూ కనిపించింది. ఈ డాల్ఫిన్ అసాధారణ గులాబీ రంగుకు గల కారణం ఇంకా తెలియరాలేదు.
ఈ అరుదైన సముద్ర జీవిని చూసి బీచ్‌కు వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.





