ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. నామినేషన్ గడువుపై SECకు సుప్రీం కీలక ఆదేశాలు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ గడువు పొడిగించాలన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థనపై రాష్ట్ర ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అభ్యర్థులు శాంతిభద్రతల సమస్యల వల్ల నామినేషన్లు వేయలేకపోయారా అన్న అంశంపై పార్టీ సమర్పించిన ఫిర్యాదులు, వీడియో ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
SEC గడువు పొడిగించాలని నిర్ణయిస్తే, ఆ నిర్ణయం ప్రకటించిన సమయం నుంచి 48 గంటల అదనపు అవకాశం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. అలాగే అక్టోబర్ 21న ప్రకటించాల్సిన తుది అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని ఆదేశించింది.
నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత, పోలీస్ బందోబస్తు, CCTV కవరేజ్ ఉండేలా చూడాలని డీజీపీకి కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ అక్టోబర్ 27న జరగనుంది.
Official Handle: @YSRCParty





