తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
మైసూరు దసరా ముగింపు.. 12 ఏనుగుల జంబూ సవారీఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. తిరుమలలో ఇక సిఫారసు లేఖలకు నో ఎంట్రీ!తిరుపతి: దక్షిణ బంగాళా ఖాతం లో ఏర్పడ్డ అల్పపీడన ద్రోని ప్రభావం.ఏపీ ఎన్నికల కోడ్.. తిరుమలలో సిఫార్సు లేఖల రద్దుఖమ్మంలో ఇన్‌ఫ్లుయెన్సర్ గుంటి నాగరాజుకు ఫేక్ ఆర్డర్ల బెడదఒక్క క్షణం ఆలస్యమైతే ప్రాణమే పోయేది.. రెండోసారి ‘లైఫ్ సేవర్’గా నిలిచిన సోనల్ ఇంగ్లే!“నన్ను వెంబడిస్తున్నారు” అన్న నాలుగు రోజులకే.. యువ లాయర్ గణేశ్ మృతిరాజ్‌కోట్, గుజరాత్: రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్ బయట వృద్ధురాలి అవస్థలుమైసూరు దసరా ముగింపు.. 12 ఏనుగుల జంబూ సవారీఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. తిరుమలలో ఇక సిఫారసు లేఖలకు నో ఎంట్రీ!తిరుపతి: దక్షిణ బంగాళా ఖాతం లో ఏర్పడ్డ అల్పపీడన ద్రోని ప్రభావం.ఏపీ ఎన్నికల కోడ్.. తిరుమలలో సిఫార్సు లేఖల రద్దుఖమ్మంలో ఇన్‌ఫ్లుయెన్సర్ గుంటి నాగరాజుకు ఫేక్ ఆర్డర్ల బెడదఒక్క క్షణం ఆలస్యమైతే ప్రాణమే పోయేది.. రెండోసారి ‘లైఫ్ సేవర్’గా నిలిచిన సోనల్ ఇంగ్లే!“నన్ను వెంబడిస్తున్నారు” అన్న నాలుగు రోజులకే.. యువ లాయర్ గణేశ్ మృతిరాజ్‌కోట్, గుజరాత్: రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్ బయట వృద్ధురాలి అవస్థలు
వాతావరణం
📅 తేదీ వారీగా

“నన్ను వెంబడిస్తున్నారు” అన్న నాలుగు రోజులకే.. యువ లాయర్ గణేశ్ మృతి

ప్రత్యేక కథనంజాతీయం
“నన్ను వెంబడిస్తున్నారు” అన్న నాలుగు రోజులకే.. యువ లాయర్ గణేశ్ మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీ. వెంకటాయపాలెంలో 27 ఏళ్ల యువ లాయర్ గణేశ్ మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏడాది నుంచి ఖమ్మం కోర్టులో జూనియర్ లాయర్‌గా పనిచేస్తున్న గణేశ్, సోమవారం రాత్రి అమ్మమ్మ ఇంటికి వెళ్లిన అనంతరం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

గత నాలుగు రోజులుగా ఎవరో తనను వెంబడిస్తున్నారని, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని గణేశ్ చెప్పినట్లు అతని తండ్రి దానయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మనసు మారుతుందనే ఉద్దేశంతో అమ్మమ్మ ఇంటికి పంపితే ఇలా జరిగిందంటూ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఆ బెదిరింపు కాల్స్ ఎవరి నుంచి వచ్చాయి? గణేశ్‌ను ఎవరు వెంబడించారు? అన్న కోణాల్లో విచారణ చేపట్టారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు