తెలుగు ఎడిషన్ · 21 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఖమ్మంలో ఇన్‌ఫ్లుయెన్సర్ గుంటి నాగరాజుకు ఫేక్ ఆర్డర్ల బెడదఒక్క క్షణం ఆలస్యమైతే ప్రాణమే పోయేది.. రెండోసారి ‘లైఫ్ సేవర్’గా నిలిచిన సోనల్ ఇంగ్లే!“నన్ను వెంబడిస్తున్నారు” అన్న నాలుగు రోజులకే.. యువ లాయర్ గణేశ్ మృతిరాజ్‌కోట్, గుజరాత్: రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్ బయట వృద్ధురాలి అవస్థలురావణుడితో పాటు 30 అడుగుల ‘బొద్దింక’ దహనం.. ఢిల్లీ రామలీలలో వినూత్న దృశ్యం!సల్మాన్ ఖాన్ టార్గెట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్అమెరికాలో ఉండలేం!అనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ఖమ్మంలో ఇన్‌ఫ్లుయెన్సర్ గుంటి నాగరాజుకు ఫేక్ ఆర్డర్ల బెడదఒక్క క్షణం ఆలస్యమైతే ప్రాణమే పోయేది.. రెండోసారి ‘లైఫ్ సేవర్’గా నిలిచిన సోనల్ ఇంగ్లే!“నన్ను వెంబడిస్తున్నారు” అన్న నాలుగు రోజులకే.. యువ లాయర్ గణేశ్ మృతిరాజ్‌కోట్, గుజరాత్: రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్ బయట వృద్ధురాలి అవస్థలురావణుడితో పాటు 30 అడుగుల ‘బొద్దింక’ దహనం.. ఢిల్లీ రామలీలలో వినూత్న దృశ్యం!సల్మాన్ ఖాన్ టార్గెట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్అమెరికాలో ఉండలేం!అనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్
వాతావరణం
📅 తేదీ వారీగా

అమెరికాలో ఉండలేం!

ప్రత్యేక కథనంజాతీయం
అమెరికాలో ఉండలేం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

భారత్ కు తరలివస్తున్న ఐటీ నిపుణులు

2026లో ఆల్ టైమ్ రికార్డు దిశగా వలసలు

ఈ తొమ్మిది నెలల్లోనే 12,700 మంది స్వదేశానికి రాక

హెచ్1బీ వీసా అనిశ్చితి, లేఆఫ్స్ తో ఆందోళన

భారత్ లో గ్లోబల్ కంపెనీల విస్తరణతో పెరుగుతున్న అవకాశాలు

దశాబ్దాలుగా కొనసాగిన బ్రెయిన్ డ్రెయిన్ ధోరణి క్రమంగా తిరగబడుతోంది.

మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ ఐటీ నిపుణులు ఇప్పుడు స్వదేశానికి తిరిగొస్తున్నారు.

అమె రికాలోని ప్రముఖ అంతర్జాతీయ ఐటీ, సాంకేతిక సంస్థల్లో పనిచేస్తున్న వైట్ కాలర్ ఉద్యోగులు భారత్ లో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు.

స్టాఫింగ్ సంస్థల గణాంకాల ప్రకారం 2026 తొలి తొమ్మిది నెలల్లోనే దాదాపు 12.700 మంది టెక్ నిపుణులు అమెరికాను వీడి భారత్ కు చేరుకున్నారు.

2023 లో 7,200 మంది, 2024 లో 9,800 మంది, 2025 లో 15,100 మంది స్వదేశానికి తిరిగొచ్చినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.

ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగితే గత రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.

అమెరికాలో స్థిరపడటమే లక్ష్యంగా భావించిన అనేక మంది ఇప్పుడు భారత్ లో పెరుగుతున్న అవకాశాలవైపు దృష్టి సారిస్తున్నారు.

హైదరాబాద్,బెంగళూరు, పుణె, గురుగ్రామ్ వంటి నగరాలు వారికి ప్రధాన గమ్యస్థానాలుగా మారుతున్నాయి.

భారత్ లో గ్లోబల్ కంపెనీల విస్తరణ

దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విస్తరణ రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ కు మరో ప్రధాన కారణంగా నిలుస్తోంది.

అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ 500 కంపెనీలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు భారత్ లో తమ పరిశోధన, అభివృద్ది, ఇంజినీరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి.

హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఈ కేంద్రాల కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి.

గతంలో విదేశీ కంపెనీలకు సహాయక సేవలు అందించడానికే పరిమితమైన అనేక కేంద్రాలు ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ వంటి రంగాల్లో కీలక ప్రాజెక్టులను భారత్ నుంచే నిర్వహిస్తున్నారు.

దీంతో అంతర్జాతీయస్థాయి అనుభవం ఉన్న నిపుణులకు దేశంలోనే ఉన్నతస్థాయి ఉద్యోగాలు, నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశాలు లభిస్తున్నాయి.

అమెరికాతో పోలిస్తే వేతనాల్లో వ్యత్యాసం ఉన్నప్పటికీ, మెరుగైన హోదాలు, కెరీర్ పురోగతి, అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశాలు వారిని ఆకర్షిస్తున్నాయి.

వేతనాల వ్యత్యాసం ప్రధాన సవాలు

అమెరికాను వీడి భారత్ కు రావడం అంత సులభమైన నిర్ణయం కాదు.

అక్కడ లభించే అధిక వేతనాలతో పోలిస్తే భారత్ లో జీతాలు “ తక్కువగా ఉండటంతో చాలామంది ఆదాయంలో సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది.

అమెరికా నుంచి అత్యున్నత సాంకేతిక నైపుణ్యాలు, పరిశోధనా అనుభవం.

ఆవిష్కరణల ఆలోచనలతో కూడిన నిపుణులు భారత్ కు తిరిగిరావడం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరంగా మారే అవకాశముంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు