అనంతపురం జిల్లా: జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్

ఫ్యాక్షన్ రాజకీయాల్లో నాకూ బాధ్యత ఉంది.. గతంలో జరిగిన తప్పులకు క్షమించండి
ఫ్యాక్షన్ గొడవలతో ఎన్నో కుటుంబాలు నాశనం.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు
ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని తలుచుకుంటే బాధేస్తోంది
ఎల్లనూరు ప్రజలు ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉండాలి
ఎల్లనూరు ప్రజలు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైసీపీ నాయకుడు భోగాతి నారాయణరెడ్డిని నమ్మొద్దు
ఫ్యాక్షన్ గొడవల్లో అన్నీ పోగొట్టుకున్నారు..
దమ్ముంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేయండి.. ప్రజలను గొడవల్లోకి లాగొద్దు
పాలిటిక్స్ చదరంగం ఆట లాంటిది.... నేరుగా వచ్చి తేల్చుకుందాం
నేను వైసీపీకీ వ్యతిరేకం కాదు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరుకే వ్యతిరేకం
అమాయక ప్రజలను రెచ్చగొట్టి గొడవలకు దూర్చొద్దు
గొడవలు వద్దు.. పిల్లల చదువులు, కుటుంబ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి
ఒకప్పుడు నేను మంచోడిని కాకపోయినా.. ఇప్పుడు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నా
అవకాశం వస్తే నాలుగు చెరువులు నింపేందుకు కృషి చేస్తా
ఎల్లనూరు మండలంలో ప్రశాంత వాతావరణం ఉండాలి.. ప్రజలంతా బాగుండాలి





