కారు ఢీకొని కృష్ణా ఫేజ్-2 పైప్‌లైన్ ధ్వంసం.. 5 గంటల్లోనే జలమండలి రికార్డు మరమ్మతులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ ఉప్పల్ బాగాయత్ సమీపంలో కారు ఢీకొనడంతో కృష్ణా ఫేజ్-2 పైప్‌లైన్‌కు చెందిన ఎయిర్ వాల్వ్, రక్షణ కంచె ధ్వంసమై భారీగా నీరు లీకైంది.
ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన జలమండలి ట్రాన్స్‌మిషన్ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి కేవలం ఐదు గంటల్లోనే పనులు పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.
పండుగ వేళ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలు సమన్వయంతో పని చేశాయి. వేగంగా స్పందించిన అధికారులు, సిబ్బందిని జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి అభినందించారు.





