పోలవరం జిల్లా: రంపచోడవరం మండలం ,

రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామంలో విషాదం..
రోడ్ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నతమ్ముళ్లు దుర్మరణం..
గెద్దాడ నుండి రంపచోడవరం వైపుగా వస్తుండగా ప్రధాన రహదారిపై వర్షం కారణంగా జారీ పడిపోయిన బైక్..
ప్రమాద సమయంలో తల్లి ముందే మృత్యులోకానికి వెళ్లిన కొడుకులు..
మర్రివాడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తల్లి ,కూతురు ఇద్దరు కొడుకులు బైక్ పై వస్తుండగా రంపచోడవరం వద్ద ఘటన..
ప్రమాదంలో ఇద్దరు చింగోజీ హరి (19),చింగోజీ కిరణ్ (17) మృతి చెందగా, గాయాలతో బయటపడిన తల్లి,చెల్లి...
మృతులు మరణంతో మర్రివాడ గిరిజన గ్రామంలో విషాద ఛాయలు..
వర్షానికి రోడ్ పై బైక్ జారిపడి..వెనుక నుండి వస్తున్న వ్యాను లోకి దూసుకెళ్లడంతో జరిగిన ఘటన..
ప్రమాద సమయంలో బైక్ పై నలుగురు రంపచోడవరం వైపుగా వస్తుండగా ఘటన..
దసరా కావడంతో అమ్మమ్మ ఇంటి నుండి అమ్మను,చెల్లి నీ తీసుకురావడానికి వెళ్ళిన అన్న తమ్ములు.





