తెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్

అంతర్రాష్ట్ర సింథటిక్ డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు
మహారాష్ట్రలో రహస్య డ్రగ్స్ తయారీ కేంద్రం గుర్తింపు
గోండియా జిల్లా తిరోడా తాలూకా మారేగావ్‌లో అక్రమ ల్యాబ్ బయటపెట్టిన ఈగల్ ఫోర్స్
పౌల్ట్రీ ఫామ్‌లో డ్రగ్స్ తయారీకి ఉపయోగించిన పరికరాలు, రసాయనాలను గుర్తింపు
తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాల్లో విస్తరించిన డ్రగ్స్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు
డ్రగ్స్ తయారీ, రసాయనాల సరఫరా, రవాణాలో కీలక వ్యక్తుల పాత్రపై విచారణ
బీబీనగర్ పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన భారీ డ్రగ్స్ వ్యవహారం
ఆగస్టు 8న టయోటా ఫార్చ్యూనర్ వాహనంలో 27.2 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం
అదే వాహనం నుంచి 56.98 కిలోల అసిటోన్ సీజ్
తొలుత ముగ్గురిని అదుపులోకి తీసుకున్న బీబీనగర్ పోలీసులు
కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును ఈగల్ ఫోర్స్‌కు బదిలీ
కొండమడుగు, మౌలాలి ల్యాబ్‌లతో పాటు మహారాష్ట్రలోని అనుమానిత తయారీ కేంద్రంపై విచారణ
డ్రగ్స్ తయారీలో ఉపయోగించే ప్రొపియోనిల్ క్లోరైడ్ సరఫరాపై ఆరా
జేఎస్‌వీ గ్లోబల్స్ యజమాని జైరాజ్ కృష్ణ శెట్టిని అక్టోబర్ 17న అరెస్ట్ చేసిన ఈగల్ ఫోర్స్
రసాయనాల సరఫరాదారులు, ల్యాబ్ నిర్వాహకులు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌పై దృష్టి
మొత్తం కేసు దర్యాప్తులో 11 మంది అరెస్ట్ లేదా కస్టడీలో ఉన్నట్లు అందిన వివరాలు
మరో 13 మంది పరారీలో ఉన్నట్లు కేసు సమాచారంలో వెల్లడి
మెఫెడ్రోన్, ఆల్ప్రాజోలం, ఎఫెడ్రిన్ తయారీ, సరఫరా కోణాల్లోనూ దర్యాప్తు
అంతర్రాష్ట్ర డ్రగ్స్ తయారీ నెట్‌వర్క్ మూలాలను ఛేదించేందుకు ఈగల్ ఫోర్స్ చర్యలు కొనసాగింపు





