బోయపల్లిలో అర్ధరాత్రి దొంగల బీభత్సం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సిరంగి శ్రీనివాసన్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేసి మూడు తులాల బంగారం, లక్ష రూపాయల నగదు, ఇరవై తులాల వెండిని అపహరించారు. గ్రామంలోని మరో మూడు ఇళ్లలోనూ దొంగలు చోరీకి యత్నించారు. తాండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.





