డోర్ ‘ఫ్లోర్ స్ప్రింగ్’లో రూ.4 కోట్ల బంగారం!.. స్మగ్లింగ్‌కు కొత్త టెక్నిక్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దేశంలోకి బంగారం అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ IGI ఎయిర్‌పోర్టులో రూ.4.03 కోట్ల విలువైన 3.20 కిలోల బంగారం రాడ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా, డోర్ ఫ్లోర్ స్ప్రింగ్‌లో అత్యంత చాకచక్యంగా దాచిన బంగారం రాడ్లు బయటపడ్డాయి.
నిందితుడిపై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ స్మగ్లింగ్ వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





