అంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- అమలాపురం..

అమలాపురంలో మహిషాసురమర్దిని అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట.. లక్ష 53 వేలకు పాడుకున్న హైదరాబాద్ వాసి ఆకుల లక్ష్మణరావు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రవణం వీధిలో ఉన్న శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి మెడలో వేసే మొదటి పూలదండ కు వేలంపాట..
79వ విజయదశమి సందర్భంగా ప్రతి ఏట మాదిరిగానే అమ్మవారి పూలదండ వేలంపాట..
హైదరాబాద్ నుండి అమలాపురం వచ్చి వేలంపాట లో పాల్గొన్న ఆకుల లక్ష్మణరావు..
వరుసగా మూడోసారి దక్కించుకున్న అమ్మవారి మెడలో వేసే మొదటి పూలదండ అవకాశం..
14 సంవత్సరాల క్రితం 3వేల 500 తో ప్రారంభం అయిన పూలదండ వేలంపాట నేడు లక్ష 53 వేలకు చేరింది..
అమలాపురం నుండి వెళ్లి హైద్రాబాద్ లో స్థిరపడిన వ్యాపారవేత్త లక్ష్మణరావు వరుసగా మూడోసారి పూలదండ వేసేందుకు వేలంపాటలో అవకాశం దక్కించుకున్నారు..
అమ్మవారి పూలదండ వేసే అవకాశం దక్కించుకోవడంతోపాటు అమ్మవారి విగ్రహానికి లక్షల రూపాయలతో టేకుతో మందిరం కూడా చేయించిన లక్ష్మణరావు..
సాధారణంగా వినాయక చవితి కి లడ్డు పాటలు లేదా అమ్మవారి చీరలు ,నగలు వంటివి వేలం పాటలు జరుగుతాయి కానీ ఇక్కడ మహిషాసురమర్దిని అమ్మవారికి మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట జరగడం విశేషం..
విజయదశమి రోజున మహిషాసురమర్దిని అమ్మవారి మెడలో ఈ పూలదండ వేయనున్నారు..
ప్రతి సంవత్సరం ఆన్లైన్ లో వేలంపాట లో పాల్గొనే లక్ష్మణరావు ఈసారి నేరుగా అమలాపురం వచ్చి వేలంపాటలో పాల్గొన్న లక్ష్మణరావు..
అమ్మవారి ఆశీస్సులతో తాను వ్యాపారం రంగంలో తన పిల్లలు విదేశాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపిన ఆకుల లక్ష్మణరావు..
వరుసగా మూడోసారి పూలదండ దక్కించుకున్న ఆయనకు గజమాలతో సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు..





