మక్కా మసీదులో ‘అశ్లీల చర్యలు’.. ఇద్దరు బంగ్లాదేశీయులకు సౌదీలో మరణశిక్ష అమలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సౌదీ అరేబియాలోని మక్కాలో ఒక మసీదులో ‘అశ్లీల చర్యలకు’ పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులకు మరణశిక్ష అమలు చేసినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.
మృతులను నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బషీర్, సితీ అఖ్తర్గా గుర్తించారు. సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, వారిని అరెస్టు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో హాజరుపరచగా, ఆరోపణలు రుజువైనట్లు కోర్టు తేల్చింది. అనంతరం తుది అనుమతుల తర్వాత అక్టోబర్ 14న మక్కా ప్రాంతంలో శిక్ష అమలు చేశారు.





