ఆర్మూర్ హైవేపై ‘వసూళ్ల’ ఆరోపణలు.. RTA సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటున్న వాహనదారులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల పేరుతో లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ RTA సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తనిఖీల సమయంలో నిబంధనల పేరుతో డబ్బులు అడుగుతున్నారని కొందరు డ్రైవర్లు ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఆరోపణలపై సంబంధిత రవాణా శాఖ అధికారుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.





