జూబ్లీహిల్స్ ‘Forefathers’ పబ్కు షాక్! రూ.20 వేల ఫైన్, వాటర్ కనెక్షన్ కట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని Forefathers Pubపై హైదరాబాద్ జలమండలి కఠిన చర్యలు తీసుకుంది. తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు రూ.20 వేల జరిమానా విధించి, వాటర్ కనెక్షన్ను డిస్కనెక్ట్ చేశారు.
అంతేకాకుండా, జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ఆ సంస్థకు అందించే కమర్షియల్ వాటర్ ట్యాంకర్ సరఫరాను కూడా నిలిపివేశారు.
వేసవిలో నీటి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు సహా కమర్షియల్ సంస్థలు తాగునీటిని వృథా చేయొద్దని జలమండలి హెచ్చరించింది.
నీటి వృథా కనిపిస్తే WhatsApp: 99499 30003 లేదా Customer Care: 155313కు ఫిర్యాదు చేయాలని సూచించింది.





