తాగునీటి దుర్వినియోగంపై వాటర్ బోర్డు కఠిన చర్యలు..

జూబ్లీహిల్స్లోని ఫోర్ ఫాదర్స్ పబ్కు 20 వేల జరిమానా,తాగునీటి కనెక్షన్ తొలగింపు..
కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల సరఫరా కూడా నిలిపివేత..
నీటి వృథాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: జలమండలి
అంతేకాకుండా తాగునీటి కనెక్షన్ను తొలగించడంతో పాటు జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అందించే నీటి సరఫరాను కూడా నిలిపివేత..
రానున్న వేసవిలో నీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి ప్రజలకు విజ్ఞప్తి..
ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు, ఇతర వాణిజ్య సంస్థలు తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచన..
నీటి దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలతో పాటు నీటి కనెక్షన్ల తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరిక





