మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుపతి మారుతీ నగర్లోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసానికి వెళ్లిన సదుం పోలీసులు ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇంటి నుంచి పుంగనూరుకు వెళ్లొద్దంటూ ఆ నోటీసుల్లో పోలీసులు సూచించారు. అయితే పోలీసులతో నామినేషన్లను అడ్డుకుంటున్నారని పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు. నామినేషన్లు వేయకుండా పోలీసుల చేత నోటీసులు ఇప్పించి హౌస్ అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.





