పోలీసుల ఆంక్షలపై మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మికి జగన్ మరోసారి అవకాశం కల్పించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఓసీ జనరల్ స్థానంలో బీసీ మహిళకు అవకాశం ఇవ్వడం సామాజిక న్యాయానికి నిదర్శనం అని చెప్పారు. కూటమి పాలనలో నగర అభివృద్ధి కుంటుపడిందని.. వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు 50 మందికే అనుమతి ఇచ్చిన పోలీసులు.. కూటమి పార్టీలకు మాత్రం భారీ ర్యాలీలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.





