గిద్దలూరులో మున్సిపల్ చైర్మన్ పీఠంపై చిచ్చు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పీఠం కూటమిలో చిచ్చుపెట్టింది. చైర్మన్ స్థానాన్ని అధిష్టానం బీజేపీకి కేటాయించడంతో.. ఆ పార్టీ నుంచి జేవీ నారాయణ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే అశోకరెడ్డి సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మరోవైపు వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా నరసింహారెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు.





