ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.





