సద్దుల బతుకమ్మతో నేడు ముగియనున్న పూల పండుగ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు నేడు ఘనంగా జరగనున్నాయి. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలు ఈరోజుతో ముగియనున్నాయి.
గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ, ఆటలతో సంబరాలు జరుపుకోనున్నారు. అనంతరం సమీప చెరువులు, కుంటలు, జలాశయాల్లో బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు.
హైదరాబాద్లో ప్రధాన వేడుకలు ట్యాంక్బండ్ పరిసరాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నుంచి బతుకమ్మ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నగరం పండుగ వాతావరణంలో మునిగిపోనుంది.





