పారిస్లో అల్లర్ల మంటలు.. వీధుల్లో ఘర్షణలు, వాహనాలకు నిప్పు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఫ్రాన్స్లో కొనసాగుతున్న భారీ నిరసనలు పలు నగరాల్లో హింసాత్మకంగా మారాయి. పారిస్లో పోలీసులతో ఘర్షణలు, వాహనాలు–వస్తువులకు నిప్పంటించడం, దుకాణాల ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
విద్యా వ్యవస్థలో సమస్యలు, పెరుగుతున్న జీవన వ్యయం, ప్రభుత్వ విధానాలపై మొదలైన నిరసనల్లోకి కొన్ని హింసాత్మక గ్రూపులు చొరబడినట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు.





