దసరా ప్రయాణికులకు ఊరట.. 7 వేల ప్రత్యేక బస్సులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్లో దసరా పండుగ కోసం టీజీఎస్ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో డిమాండ్ను బట్టి అదనపు బస్సులను నడపాలని ఎండీ వై. నాగిరెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ (JBS)ను పరిశీలించిన అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
అక్టోబర్ 10 నుంచి ఇప్పటికే 95 శాతం ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆయన తెలిపారు.
పండుగ ముగిశాక తిరుగు ప్రయాణాల కోసం కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయనున్నారు.
ప్రయాణికుల సౌకర్యాలు, పారిశుధ్యం, భద్రతను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
పండుగ రద్దీ దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు.





