సూరత్‌లో మెడికల్ షాపులో నకిలీ లివ్ 52 విక్రయాలు.. యజమాని అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సూరత్‌లోని గోపిపురాలో దారుణం వెలుగుచూసింది.
పశువుల దాణా సప్లిమెంట్‌ను పసిపిల్లల 'లివ్ 52' డ్రాప్స్‌గా విక్రయిస్తున్న మెడికల్ స్టోర్ యజమాని సాజిద్ ఇబ్రహీం ముల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు.
పశువుల టానిక్‌ను చిన్న బాటిళ్లలో నింపి, వాటిపై నకిలీ లివ్ 52 లేబుళ్లు అంటిస్తూ విక్రయిస్తున్నాడు.
ఏడాదిగా దాదాపు 1,000 నకిలీ బాటిళ్లను తయారు చేసి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
హోల్‌సేల్‌గా కాకుండా కేవలం రిటైల్ కస్టమర్లకే వీటిని విడిగా అమ్ముతున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
పశువుల మందును పిల్లల లివ్ 52గా మార్చి విక్రయిస్తున్న వైనం





