యూనస్‌పై బంగ్లాదేశ్ ప్రవాసుల నిరసన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
యూఎన్ జనరల్ అసెంబ్లీ కోసం న్యూయార్క్ వచ్చిన డాక్టర్ యూనస్‌ను ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లో బంగ్లాదేశ్ ప్రవాసులు నిలదీశారు.
ప్రధానంగా ఆవామీ లీగ్ మద్దతుదారులైన నిరసనకారులు ఆయనను అడ్డుకున్నారు.
వీల్‌ఛైర్‌లో వెళ్తున్న యూనస్‌ను ‘టెర్రరిస్ట్’ అంటూ నినాదాలు చేశారు.
బంగ్లాదేశ్‌ను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని, వేలాది మంది పోలీసులు, ప్రజల ప్రాణాలు తీశారని తీవ్రంగా మండిపడ్డారు.
రెండు లక్షల మందిని అరెస్ట్ చేయించారని నిరసనకారులు ఆరోపించారు.
అయితే, ఈ వీడియోను కొందరు నెటిజన్లు భారతీయ నేతను అవమానించినట్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారు.





