Constable Jobs: ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ అంటే UKSSSC కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ sssc.uk.gov.inని చెక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కోసం రాత పరీక్ష 15 జూన్ 2025న నిర్వహిస్తారు.
విద్యార్హత:
12వ తరగతి ఉత్తీర్ణత
వయో పరిమితి:
- 18 – 22 సంవత్సరాలు
- రాష్ట్రంలోని OBC మరియు SC-ST అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
Constable Jobs ఎంపిక ప్రక్రియ:
- ఫిజికల్ టెస్ట్
- ఫిట్ నెస్ టెస్ట్
- రాత పరీక్ష
జీతం:
లెవెల్ 3 ప్రకారం, నెలకు రూ. 21,700 – 69,100.
ఫీజులు:
- జనరల్: రూ 300
- SC, ST, EWS: రూ 150
Constable Jobs కోసం ఇలా అప్లై చేసుకోండి:
- అధికారిక వెబ్సైట్ sssc.uk.gov.in కి వెళ్లండి .
- హోమ్ పేజీలో, డిజిగ్నేషన్-డ్రాఫ్ట్స్‌మ్యాన్/టెక్నీషియన్ గ్రేడ్-2 (ఎలక్ట్రికల్/మెకానికల్)/ట్యూబ్ వెల్ టెక్నీషియన్, ఇతర పోస్టుల కోసం ఆన్లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.
- మీ ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి ఫారమ్‌ను సమర్పించండి.
- దాని ప్రింటవుట్ తీసి ఉంచుకోండి.