అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం శివారు ప్రాంతం. విశాఖ శివారు ప్రాంతాలను అన్నిటినీ కలిపి అనకాపల్లి జిల్లాగా చేశారు. అనకాపల్లి మున్సిపాలిటీని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. అనకాపల్లి బెల్లం ప్రసిద్ధి పొందింది. దేశంలో రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్ గా అనకాపల్లి ఉంది. అనకాపల్లికి తూర్పున విశాఖ జిల్లా, పశ్చిమాన కాకినాడ జిల్లా, ఉత్తరాన విజయనగరం, అల్లూరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
అనకాపల్లి విశాఖకు దగ్గరగా ఉండడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. ఫార్మా కంపెనీలు ఈ జిల్లాల్లోనే ఎక్కువ ఉన్నాయి. ఏటికొప్పాక బొమ్మలు ప్రపంచ పరసిద్ధి పొందాయి. పాడేరు ఏజెన్సీకి ఈ జిల్లా ముఖద్వారంగా ఉంది. ఇక ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ ఈ జిల్లాలోనే ఉంది.
అనకాపల్లి జిల్లా పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్ ను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చేరుకోవచ్చు:
అనకాపల్లి జిల్లా తాజా సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: