అల్లూరి సీతారామ రాజు జిల్లా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసిన జిల్లా. ఆంధ్రప్రదేశ్లోని ఈశాన్య జిల్లాలలో ఒకటి. ఇది ఉత్తర అక్షాంశంలో 17o – 17′ – 18o-21′ మధ్య, తూర్పు రేఖాంశంలో 80o – 53′ – 82o – 50′ మధ్య ఉంది. ఇది ఉత్తరాన పాక్షికంగా ఒడిశా రాష్ట్రం పాక్షికంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం, పాక్షికంగా తెలంగాణ రాష్ట్రం, దక్షిణాన అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలతో పశ్చిమాన గోదావరి నది అలాగే తూర్పున విజయనగరం జిల్లాతో సరిహద్దులుగా ఉంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు. పూర్తిగా కొండల నడుమ ఈ జిల్లా ఉంది. ఇక్కడి గిరిజన ప్రజల జీవన విధానం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ జిల్లాలో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అరకు, బొర్రా గుహలు, లంబసింగి, పాడేరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్ ను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చేరుకోవచ్చు:
అల్లూరి సీతారామరాజు జిల్లా తాజా సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: