Thursday , 9 January 2025

టీటీడీలో ఉద్యోగాలకు వాకిన్ ఇంటర్వ్యూలు.. వివరాలివే.. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలో (Tirupati Jobs) ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీ కోసమై నోటిఫికేషన్ జారీ చేశారు. 

టీటీడీ (TTD Temple) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (Civil Assistant Surgeons) (BC-B(W) -01, ST (W) – 01, BC-B -01, SC -01, BC-D(W)- 01) ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల అయింది. టీటీడీ చెబుతున్నదాని ప్రకారం మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు విద్యార్హత ఎంబీబీఎస్‌.   ఈ ఉద్యోగాల కోసం  ఆగష్టు 29వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది.

తిరుపతి (Tirupati) సెంట్రల్ హాస్పిటల్‌లో ఆగస్టు 29వ తేదీన ఉదయం 11 గంటలకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు త‌మ విద్యార్హతలు, అనుభ‌వానికి సంబంధించిన ధ్రువ‌ప‌త్రాల‌ ఒరిజినల్ , జిరాక్స్ ‌ కాపీలతో ఇంట‌ర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. 

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి:  

వివరాల కోసం ఈ నెంబర్ కు కూడా కాల్ చేయవచ్చు. 0877-2264371 

Spread the love

Check Also

Government Jobs: ప్రభుత్వ రంగ సంస్థ NALCOలో ఉద్యోగావకాశాలు.. వివరాలివే 

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) 500 కంటే ఎక్కువ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *